Sunday, August 30, 2020

బ్రకోలీ వలన ఉపయోగాలు ఏమిటి

బ్రకోలీ వలన ఉపయోగాలు ఏమిటి?



1. ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది, ఇది జీర్ణక్రియకు  ఉపయోగపడుతుంది.
2. మెటబాలిజం (జీవక్రియ) ను నియంత్రిస్తుంది.
3. టైప్ 2 షుగర్ తో బాధపడేవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
4. ఇందులోని సి-విటమిన్ ఆరోగ్యకరమైన చర్మానికి ఉపయోగపడుతుంది.
5. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
6. మంచి కంటి చూపు కోసం పిల్లలు తినే ఆహారంలో బ్రకోలి ని చేర్చమని వైద్యులు సూచిస్తున్నారు.

గోరు వెచ్చని నీటిని తాగడం వలన ఉపయోగం ఏమిటి

గోరు వెచ్చని నీటిని తాగడం వలన ఉపయోగం ఏమిటి?



1. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
2. జలుబు నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
3. గోరువెచ్చని నీటిలో కాస్త సొంటి కలుపుకుని తాగితే ఒంటి నొప్పులు తగ్గుతాయి.
4. త్వరగా బరువు తగ్గుతారు.
5. అధిక కొవ్వు కరుగుతుంది.
6. మలబద్దకాన్ని అరికడుతుంది.

Saturday, August 15, 2020

అల్పాహారంగా పోహా (అటుకులు) ను తినడం వల్ల కలిగే లాభాలు ఏమిటి?

 అల్పాహారంగా పోహా

(అటుకులు) ను తినడం వల్ల కలిగే లాభాలు ఏమిటి?

దేశంలోని చాలా ప్రాంతాల్లో అల్పాహారంగా పోహ (అటుకులు)ను  తినటం అలవాటు.
 మీరు పోహను శనగలు,  కరివేపాకుతో  ఫ్రై లాగా చేసుకొని తినొచ్చు. లేదంటే అన్నం మాదిరిగా పోపు వేసి కూడా అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. పోహ ను ఎలా రుచికరంగా తయారుచేసుకోవచో దానివల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసుకుందాం. 
1.  కంట్రోల్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్:
పోహ డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. ఇందులో ఎక్కువ పరిమాణంలో ఫైబర్ ఉండడంతో పోహను తిన్నాక రక్తంలోకి షుగర్స్ నిదానంగా విడుదల అవుతాయి. ఫలితంగా ఆకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ప్రమాదం తగ్గుతుంది.
2.  ఏ గుడ్ ప్రోబయోటిక్:
చాలా మందికి పోహ  ప్రోబయోటిక్ ఫుడ్ అని తెలీదు. బియ్యాన్ని సగం ఉడికించి, కొన్ని గంటల పాటు  ఎండలో ఆరబెడతారు. తరువాత దానిని పల్చగా మలిచి పోహను తయారు చేస్తారు. కిణ్వన ప్రక్రియ ద్వారా దీనిని తయారు చేయడం వలన
దీనిలో ప్రోబయోటిక్ గుణాలు ఉండిపోతాయి. అందుకే ఇవి జీర్ణవ్యవస్థకు చాలా మంచివి.
3. కార్బోహైడ్రేట్స్ :
పరిశోధనల ప్రకారం పోహలో 76.9% కార్బోహైడ్రేట్లు, 23% ఫ్యాట్స్ ఉంటాయి. అందుకే వీటిని అల్పాహారంగా తీసుకోవడం వలన కార్బోహైడ్రేట్ల ద్వారా రోజువారీ పనులకు కావలసిన శక్తి శరీరానికి అందుతుంది.
4. లైట్ ఫుడ్:
పోహ చాలా లైట్ ఫుడ్. ఇది చాలా సులభంగా జీర్ణం అవుతుంది అందుకే దీనిని ఉదయం  అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్ గా తీసుకోవచ్చు. చాలాసేపు కడుపు నిండిన భావనను పోహ కలిగిస్తుంది.
5. రిచ్ ఇన్ ఐరన్ :
గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు పోహను తీసుకోవటం వలన శరీరానికి  కావాల్సిన ఐరన్ అందుతుంది. చాలా మందిలో రక్తహీనత సమస్యలు తలెత్తకుండా ఇది నివారిస్తుంది. ఇక శరీరం ఐరన్ను పుష్టిగా శోషించుకోవటానికీ   పోహలో కాస్త నిమ్మరసం కలిపితే సరిపోతుంది.
6. తక్కువ క్యాలరీలు : 
పోహలో  క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఒక కప్పు వెజిటేబుల్ 
పోహలో కేవలం 250 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో వాడే కరివేపాకు లాంటి పదార్థాల వల్ల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు లాంటివి పుష్కలంగా అందుతాయి. ఒకవేళ మీకు రుచికరంగా తినాలనిపిస్తే శనగలు వేసుకోండి. అయితే బరువు తగ్గాలనుకునేవారు మాత్రం శనగలను వేసుకోకపోవడం ఉత్తమం. 
పోహను ఆలీవ్ ఆయిల్ లేదా కొబ్బరినూనెలో వండడం, దానిలో సమృద్ధిగా కూరగాయలు వేసుకోవడం ద్వారా హెల్దీగా తయారుచేసుకోవచ్చు. ఇందులో మరిన్ని ప్రోటీన్ల లో యాడ్ చేయాలనుకుంటే సోయా చంక్స్ ను కలుపుకుంటే సరి పోతుంది. ఆరోగ్యపరంగా చూస్తే పోహ  అత్యుత్తమ ఆహారాల్లో ఒకటి. అందుకే మీ డైట్ లో పోహను తరచూ తీసుకుంటూ ఉండండి.

మొలకెత్తిన గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మొలకెత్తిన గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:


ఈ మధ్యన అందరూ మొలకెత్తిన విత్తనాలను తినడానికి  ఇష్టపడుతున్నారు. మార్కెట్లో ఇప్పుడు  ఇదే ట్రెండు కొనసాగుతుంది. శరీరానికిి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఈ మొలకెత్తిన విత్తనాల్లో  ఉండడం వలన అందరూ వీటిని తినడానికిి ఇష్టపడుతున్నారు. మొలకెత్తిన విత్తనాలను రోజు తినడం వల్ల కలిగేే లాభాలను తెలుసుకుందాం.
1.

ఎక్కువ ప్రోటీన్లతో కూడిన మొలకెత్తిన గింజలను తినడం వలన బరువు తగ్గవచ్చు.   మొలకెత్తిన గింజల్లో ఎక్కువ క్యాలరీలు ఉండడంతోపాటు ఫైబర్ ఉంటుంది. భోజనంతో పాటు  మొలకెత్తిన విత్తనాలను కూడా తినడం వలన ఆరోగ్యకర పద్ధతిలో  బరువు తగ్గవచ్చు.
2. 
ఫైబర్తో కూడిన మొలకెత్తిన గింజలను తినడం ద్వారా జీర్ణ శక్తిని పెంచుకోవచ్చు. మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మొలకెత్తిన గింజలను క్రమం తప్పకుండా తినడం ద్వారా శరీరంలో ఎంజైమ్లు కావాల్సిన స్థాయిలో విడుదల అవుతాయి. దీనివల్ల శరీర క్రియలు సక్రమంగా జరగడం తో పాటు మనం తీసుకునే ఆహారంలోని అన్ని రకాల పోషకాలు  శరీరానికి తగిన విధంగా అందుతాయి.
3.
క్రమం తప్పకుండా మొలకెత్తిన గింజలను తినడం ద్వారా శరీరంలోో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో పెట్టవచ్చు. మొలకెత్తిన గింజల్లో తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండడం వలన  షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది.
  4.
మొలకెత్తిన గింజలను క్రమం తప్పకుండా తినడం వలన గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
వీటిని తినడం వలన బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. అలాగే శరీరానికి కావలసిన మంచి కొలెస్ట్రాల్ ను అందించడంతో పాటు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
5. Build the immune system
మొలకెత్తిన గింజల వల్ల శరీరానికి విటమిన్ సి బాగా లభిస్తుంది.  దీనివల్ల శరీరంలో  తెల్లరక్త కణాలు వృద్ధి     చెందుతాయి. దీనివల్ల  ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. అలాగేే యాంటీ యాక్సిడెంట్లు ఉండడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
6.    
కంటి చూపు పెరగడం లో ఉపయోగపడే  విటమిన్ ఏ మొలకెత్తిన గింజల్లో ఎక్కువగా ఉంటుంది. కంటి చూపును పరీరక్షించడానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. 
 మొలకెత్తిన గింజలు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను అందించే పవర్ హౌస్. వీటిలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీన్లు,ఎంజైమ్ లు, ఫైబర్ మరియు కావాల్సిన అతి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి.
దీనిని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవడం తోపాటు సలాడ్స్ రూపంలో, కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యకర ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోండి.

బ్రకోలీ వలన ఉపయోగాలు ఏమిటి

బ్రకోలీ వలన ఉపయోగాలు ఏమిటి? 1.  ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది, ఇది జీర్ణక్రియకు  ఉపయోగపడుతుంది . 2. మెటబాలిజం (జీవక్రియ) ను నియంత్రిస్తుంది. 3...