మొలకెత్తిన గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
ఈ మధ్యన అందరూ మొలకెత్తిన విత్తనాలను తినడానికి ఇష్టపడుతున్నారు. మార్కెట్లో ఇప్పుడు ఇదే ట్రెండు కొనసాగుతుంది. శరీరానికిి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఈ మొలకెత్తిన విత్తనాల్లో ఉండడం వలన అందరూ వీటిని తినడానికిి ఇష్టపడుతున్నారు. మొలకెత్తిన విత్తనాలను రోజు తినడం వల్ల కలిగేే లాభాలను తెలుసుకుందాం.
1.
ఎక్కువ ప్రోటీన్లతో కూడిన మొలకెత్తిన గింజలను తినడం వలన బరువు తగ్గవచ్చు. మొలకెత్తిన గింజల్లో ఎక్కువ క్యాలరీలు ఉండడంతోపాటు ఫైబర్ ఉంటుంది. భోజనంతో పాటు మొలకెత్తిన విత్తనాలను కూడా తినడం వలన ఆరోగ్యకర పద్ధతిలో బరువు తగ్గవచ్చు.
ఫైబర్తో కూడిన మొలకెత్తిన గింజలను తినడం ద్వారా జీర్ణ శక్తిని పెంచుకోవచ్చు. మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మొలకెత్తిన గింజలను క్రమం తప్పకుండా తినడం ద్వారా శరీరంలో ఎంజైమ్లు కావాల్సిన స్థాయిలో విడుదల అవుతాయి. దీనివల్ల శరీర క్రియలు సక్రమంగా జరగడం తో పాటు మనం తీసుకునే ఆహారంలోని అన్ని రకాల పోషకాలు శరీరానికి తగిన విధంగా అందుతాయి.
3.
క్రమం తప్పకుండా మొలకెత్తిన గింజలను తినడం ద్వారా శరీరంలోో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో పెట్టవచ్చు. మొలకెత్తిన గింజల్లో తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండడం వలన షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది.
4.
వీటిని తినడం వలన బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. అలాగే శరీరానికి కావలసిన మంచి కొలెస్ట్రాల్ ను అందించడంతో పాటు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
5. Build the immune system
కంటి చూపు పెరగడం లో ఉపయోగపడే విటమిన్ ఏ మొలకెత్తిన గింజల్లో ఎక్కువగా ఉంటుంది. కంటి చూపును పరీరక్షించడానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి.
మొలకెత్తిన గింజలు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను అందించే పవర్ హౌస్. వీటిలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీన్లు,ఎంజైమ్ లు, ఫైబర్ మరియు కావాల్సిన అతి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి.
దీనిని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవడం తోపాటు సలాడ్స్ రూపంలో, కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యకర ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోండి.
No comments:
Post a Comment