- కాచి వడబోసి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలి.
- తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారాన్ని, శాఖాహారాన్ని రెండింటినీ సమపాళ్ళల్లో తీసుకోవాలి.
- బత్తాయి, నారింజ, కమలా పండ్ల వంటివి తినేటప్పుడు పిప్పి ఊసేయకుండా తినటం మంచిది. వీలయినంత వరకు కాయగూరల పైన తొక్కు తీయకుండా వండుకోవాలి.
- వేసవి కాలంలో మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. మంచినీటి పాత్రలోకి నేరుగా గ్లాసులను ముంచకుండా పాత్ర క్రింద భాగాన కుళాయి ఏర్పాటు చేసుకుంటే మంచిది. శుభ్రంగా ఉంటుంది.
- ఆహార పదార్థాల పైన ఈగలు, క్రిమికీటకాలు వాలకుండా చూసుకోవాలి.
- కాయగూరలను పండ్లను నీళ్ళతో కడిగిన తర్వాతనే ఆహారంగా తీసుకోవాలి.
- నిద్రలేమితో బాధపడుతున్న వారు పడుకునే ముందు కొత్తిమీర రసం, పంచదార కలిపిన నీళ్ళను తాగితే ఫలితం ఉంటుంది.
- రక్తంలోని కొలెస్టల్ ను తగ్గించుకొని సన్నబడాలంటే పెరుగును ప్రతి రోజూ ఎక్కువగా తీసుకోవాలి.
- రాత్రి పడుకోబోయేటప్పుడు ఒక గ్లాసు మంచి నీటిలో ఒక తులం పటిక బెల్లం వేసి వుంచి ఆ నీటిని ఉదయం లేవగానే తాగాలి. పది హేను రోజుల పాటు ఇలా చేస్తే పార్శ్వనొప్పి తగ్గుతుంది.
- చిటికెడు పసుపు గ్లాసు పాలలో కాచి, రోజూ ఉదయాన్నే తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతుంది.
- గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ తగ్గాలంటే రోజుకు రెండుసార్లు కప్పు పాలల్లో ఒక వెల్లుల్లి రేకు ముక్కలుగా చేసి బాగా మరగనిచ్చి వెల్లుల్లి ముక్కలను తీసి, ఆ పాలు తాగితే మంచి గుణం కన్పిస్తుంది.
- దగ్గు, ఆయాసంతో బాధపడేవారు అల్లం రసం 1 స్పూన్, దానిమ్మరసం 1 స్పూన్, తేనె 1 స్పూన్ ఈ మూడూ కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే దగ్గు, ఆయాసం బాగా తగ్గుతాయి.
- చిన్నపిల్లలు మలబద్దకంతో బాధపడుతుంటే రోజూ రెండు స్పూన్లు ద్రాక్షరసం ఇస్తూ ఉంటే మలబద్దకం పోతుంది,
- అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు తోటకూర, క్యారెట్, నారింజ నాలను సమంగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తీసుకోవాలి.
- మూత్ర విసర్జనలో బాధగా లేదా మంటగా ఉంటే క్యాబేజీని మాత్రం అసలు తినకూడదు.
Thursday, June 11, 2020
మంచి ఆరోగ్యం కోసం ఎలాంటి పద్ధతులను అనుసరించాలి?
Subscribe to:
Post Comments (Atom)
బ్రకోలీ వలన ఉపయోగాలు ఏమిటి
బ్రకోలీ వలన ఉపయోగాలు ఏమిటి? 1. ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది, ఇది జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది . 2. మెటబాలిజం (జీవక్రియ) ను నియంత్రిస్తుంది. 3...

-
మొలకెత్తిన గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: ఈ మధ్యన అందరూ మొలకెత్తిన విత్తనాలను తినడానికి ఇష్టపడుతున్నారు. మార్కెట్లో ఇప్పుడు ఇదే ట్రెం...
-
బీట్ రూట్ జ్యూస్ సమ్మర్లో బీట్ రూట్ జ్యూస్ తాగుతున్నారా... ఈ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం... బరువు తగ్గడానికీ, లివర్ ను కాపాడేందుకు ఇ...
-
అల్పాహారంగా పోహా (అటుకులు) ను తినడం వల్ల కలిగే లాభాలు ఏమిటి? దేశంలోని చాలా ప్రాంతాల్లో అల్పాహారంగా పోహ (అటుకులు)ను తినటం అలవాటు. మీరు పో...
No comments:
Post a Comment