లవంగం తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:
1. లవంగాల లో ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి మరియు విటమిన్ కె పుష్కలంగా లభిస్తాయి.
2. మాంగనీస్ మెదడు పని తీరును పెంచుతుంది మరియు ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడుతుంది.
3. విటమిన్ సి మరియు కె రోగనిరోధకత ను పెంచుతాయి.
4. లవంగాల లో యాంటి మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారం వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడుతుంది.
5. లవంగాలలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
6. ఎందుకంటే అంటు వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది.